ఇన్స్టాల్

jyothi

#భక్తి & ఆధ్యాత్మికతం12/02/2019, 2:13:24 am
రామాయణంతో పరిచయం ఉన్న వారందరికీ జటాయువు పేరు తెలుసు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోతూండగా ప్రాణాలను లెక్క చేయకుండా సీతను కాపాడడానికి ఆ పెద్ద పక్షి ప్రయత్నించింది. అయితే రావణాసురునితో యుద్ధంలో అతను రెక్కలు నరికివేయడంతో నేలకూలి, గాయాలతో మరణించింది. ఆ జటాయువు పడిపోయిన ప్రాంతంగా భావిస్తున్న కొల్లం జిల్లాలోని చదయమంగళంలో ఇప్పుడు జటాయు జాతీయ పార్కు రూపుదిద్దుకుంటోంది. ఇక్కడి పార్కులో ముఖ్య ఆకర్షణ అక్కడ కొండ మీద ఉన్న పెద్ద జటాయు శిల్పం. దీనిని ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి విగ్రహంగా పేర్కొనవచ్చు. ఆ విగ్రహం ఎత్తు 70 అడుగులు కాగా, వెడల్పు 150 అడుగులు, దీని పొడవు 200 అడుగులు. ఈ విగ్రహం దాని చుట్టుపక్కల ప్రాంతం విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. ఈ విగ్రహం లోపలి భాగంలో 6డి థియేటర్‌, దృశ్య శ్రవణ డిజిటల్‌ మ్యూజియం, సిద్ధ, ఆయుర్వద కేవ్‌ రిసార్ట్‌ వంటివి ఉన్నాయి. మ్యూజియంలో రామాయణంలోని సంఘటనలను చూపుతారు. సముద్ర మట్ట్టానికి 1000 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని దర్శించే అవకాశం కూడా లభిస్తుంది.
65 ఎకరాల్లో నిర్మించిన ఈ పార్కులో సాహస క్రీడలకు గాను అడ్వెంచర్‌ జోన్‌ కూడా ఉంది. దానిలో పెయింట్‌ బాల్‌, విలువిద్య, లేజర్‌ ట్యాగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, రాపెల్లింగ్‌ వంటి 20 రకాల క్రీడలు ఉంటాయి. విగ్రహం ఉన్న ప్రాంతానికి కేబుల్‌ కార్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నా రు. ఈ జటాయువు విగ్రహాన్ని ప్రముఖ మళయాళ సినీ దర్శకుడు రాజీవ్‌ ఆంచల్‌ రూపొందించారు. ఈ విగ్రహం నిర్మించడానికి ఏడేళ్లు పట్టిందని తెలిసింది. లోపల కాంక్రీటుతో నిర్మించిన దీనిని బయటకు శిలలతో నిర్మించినట్టు కనిపించేదిగా రూపొందించారు.
రామాయణంతో పరిచయం ఉన్న వారందరికీ జటాయువు పేరు తెలుసు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోతూండగా ప్రాణాలను లెక్క చేయకుండా సీతను కాపాడడానికి ఆ పెద్ద పక్షి ప్రయత్నించింది. అయితే రావణాసురునితో యుద్ధంలో అతను రెక్కలు నరికివేయడంతో నేలకూలి, గాయాలతో మరణించింది. ఆ జటాయువు పడిపోయిన ప్రాంతంగా భావిస్తున్న కొల్లం జిల్లాలోని చదయమంగళంలో ఇప్పుడు జటాయు జాతీయ పార్కు రూపుదిద్దుకుంటోంది. ఇక్కడి పార్కులో ముఖ్య ఆకర్షణ అక్కడ కొండ మీద ఉన్న పెద్ద జటాయు శిల్పం. దీనిని ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి విగ్రహంగా పేర్కొనవచ్చు. ఆ విగ్రహం ఎత్తు 70 అడుగులు కాగా, వెడల్పు 150 అడుగులు, దీని పొడవు 200 అడుగులు. ఈ విగ్రహం దాని చుట్టుపక్కల ప్రాంతం విస్తీర్ణం 15,000 చదరపు అడుగులు. ఈ విగ్రహం లోపలి భాగంలో 6డి థియేటర్‌, దృశ్య శ్రవణ డిజిటల్‌ మ్యూజియం, సిద్ధ, ఆయుర్వద కేవ్‌ రిసార్ట్‌ వంటివి ఉన్నాయి. మ్యూజియంలో రామాయణంలోని సంఘటనలను చూపుతారు. సముద్ర మట్ట్టానికి 1000 అడుగుల ఎత్తు నుంచి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని దర్శించే అవకాశం కూడా లభిస్తుంది. 65 ఎకరాల్లో నిర్మించిన ఈ పార్కులో సాహస క్రీడలకు గాను అడ్వెంచర్‌ జోన్‌ కూడా ఉంది. దానిలో పెయింట్‌ బాల్‌, విలువిద్య, లేజర్‌ ట్యాగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, రాపెల్లింగ్‌ వంటి 20 రకాల క్రీడలు ఉంటాయి. విగ్రహం ఉన్న ప్రాంతానికి కేబుల్‌ కార్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేయనున్నా రు. ఈ జటాయువు విగ్రహాన్ని ప్రముఖ మళయాళ సినీ దర్శకుడు రాజీవ్‌ ఆంచల్‌ రూపొందించారు. ఈ విగ్రహం నిర్మించడానికి ఏడేళ్లు పట్టిందని తెలిసింది. లోపల కాంక్రీటుతో నిర్మించిన దీనిని బయటకు శిలలతో నిర్మించినట్టు కనిపించేదిగా రూపొందించారు.