ఇన్స్టాల్

BK sai syam manohar kanagala

#ప్రేరణ11/02/2019, 6:18:22 pm
ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంత భారీ బడ్జెట్ అవసరమా.. పది కోట్లుకాదు వందకోట్లు కాదు ఏకంగా వెయ్యికోట్లా.. ఈ ప్రొడ్యూసర్కి పోయేకాలం దగ్గరకొచ్చింది... లేకపోతే వాడేమైనా ప్రభాసా..మహేషా.. డబ్బెక్కువై తీస్తున్నాడో బుర్రతక్కువై తగలేస్తున్నాడో అర్ధమై చావడంలేదు..
ఏ తలకుమాసినవాడండి వీడికి వాడిని హీరోగా పెట్టి సినిమా తీయమని సలహా ఇచ్చింది.. ఈ దెబ్బకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బాహుబలి విజయంతో వచ్చిన మంచి పేరు పోవడం ఖాయం నా విశ్లేషణ తప్పైతే ఇక జన్మలో మరో సినిమా పై రివ్యూ రాయను
గొంతు లో పచ్చి వెలక్కాయ అడ్డంపడ్డంత పనైంది.. నా మొదటి సినిమా 'మీసమున్న దేవుడు'సినిమా ఫస్ట్ లుక్ పై ప్రముఖ క్రిటిక్ చేసిన కటిక విశ్లేషణ.. చదివినంత సేపూ కన్నీరాగలేదు.. గుండెను ఎవరో బలవంతంగా పిండేస్తున్న బాధ.. గొంతుకనెవరో పిసికేస్తున్నట్టు ఉంది
అవును.. ఆయనన్నదాంట్లో తప్పేముంది.. నేనుండే ఇంట్లో పక్క వాటా వాళ్ళుకూడా నేను రోడ్డు మీద కనపడితే.. నేను పలకరించి పరిచయం చేసుకుంటే తప్ప గుర్తించలేరు.. అటువంటి నాలాంటి ఒక అనామకుని తో ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎందుకు తీస్తున్నట్టు.. ఆయన్నే అడిగేద్దాం అని నిర్ణయించుకుని ఫోన్ చేశాను.. తీరా డయల్ చేసి ఫోన్ రింగవుతుంటే గుండెల్లో ఒకటే దడ.. ప్రొడ్యూసర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం ఏంటని అడిగితే ఏమని చెప్పాలి.. ఏ నమ్మకంతో నాతో సినిమా తీస్తున్నారని అడగాలా.. అలా అడిగితే ఆయన ఏమనుకుంటారో.. మరేమని అడగాలి.. ఇలా ఆలోచిస్తుండాగానే.. అనుకున్నట్టుగానే ప్రొడ్యూసర్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు.. ఆ.. హీరోగారూ చెప్పండి..ఏంటి విషయం అని ఎంతో అనునయంగా అన్నారు..నాకు నోట మాటరాలేదు.. కళ్ళ వెంట కన్నీటి ధారలూ ఆగటం లేదు.. నా మౌనం వెనుకదాగున్న భావాన్ని ఆయన గ్రహించినట్టున్నారు.. హీరోగారూ.. ఈ రోజు పేపర్ చదివారా .. ఔనండీ అని తడబడుతూ బెరుగ్గా సమాధానం చెప్పాను.. హీరోగారూ.. నేనో బిజినెస్ మ్యాన్ అన్న సంగతి మీకు తెలుసనుకుంటాను.. తెలుసండీ.. మరి నేను చేసే బిజినెస్ ఏంటో తెలుసా ..తెలియదండీ.. వజ్రాల వ్యపారం.. ఈ వ్యాపారంలో నాకున్న అపార అనుభవంతో ఒక్కసారి చూడగానే ఒక వజ్రం గురించిన వివరాలు కచ్చితంగా చెప్పేయగలను.. అలాగే మనుషుల వ్యక్తిత్వాన్ని అవలీలగా కనిపెట్టగలను.. మీరు ఆ రోజు మా ఆఫీసుకు అటెండర్ పోస్టుకు ఇంటర్వూకు వచ్చినప్పుడే మిమ్మల్ని నిశితంగా పరిశీలించాను.. మీ కళ్ళలో తేజస్సు ముఖంలో వర్ఛస్సు నడకలో హుందాతనం.. అన్నింటికీ మించి మీ ఉన్నత వ్యక్తిత్వం.. విలక్షణ భావజాలం నన్ను ఆకట్టుకున్నాయి.. అప్పుడే నిర్ణయించుకున్నాను.. నేను తీస్తున్న ఈ సంచలన చిత్రానికి మీరే హీరో అని.. అందుకే ఆ రోజు మీకు కావాలనే ఉద్యోగం ఇవ్వలేదు.. ఇక ఆ రివ్యూ అంటారా అది ఆ వ్యక్తి దృష్ఠికోణం.. దానిని పట్టించుకోకండి..ఒకటిమాత్రం గుర్తుంచుకోండి ఈ సినిమాకేకాదు దీనికి సీక్వెల్గా వచ్చే అన్ని సినిమాలకూ మీరే హీరో ...కాబట్టి అనవసర భయాందోళనలు పక్కనపెట్టి షూటింగుకు ప్రిపేరవ్వండి..రేపు సెట్లో కలుద్దాం..అని పెట్టేశారు..మనసంతా ఆనందం..పట్టరాని సంతోషం.. రేపే షూటింగ్..జీవితంలో మొదటిసారి కెమేరాను ఫేస్ చేయబోతున్నాను.. ఇదే ఆలోచనలతో నిద్ర లేచిన నేను తొందరగా తయారయ్యాను.. ఇంతలో నన్ను పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది.. ఎక్కి కూర్చున్నాను.. కారు బయలుదేరింది... షూటింగ్ జరిగే ప్రదేశానికి...

........................... ఇంకావుంది
ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంత భారీ బడ్జెట్ అవసరమా.. పది కోట్లుకాదు వందకోట్లు కాదు ఏకంగా వెయ్యికోట్లా.. ఈ ప్రొడ్యూసర్కి పోయేకాలం దగ్గరకొచ్చింది... లేకపోతే వాడేమైనా ప్రభాసా..మహేషా.. డబ్బెక్కువై తీస్తున్నాడో బుర్రతక్కువై తగలేస్తున్నాడో అర్ధమై చావడంలేదు.. ఏ తలకుమాసినవాడండి వీడికి వాడిని హీరోగా పెట్టి సినిమా తీయమని సలహా ఇచ్చింది.. ఈ దెబ్బకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి బాహుబలి విజయంతో వచ్చిన మంచి పేరు పోవడం ఖాయం నా విశ్లేషణ తప్పైతే ఇక జన్మలో మరో సినిమా పై రివ్యూ రాయను గొంతు లో పచ్చి వెలక్కాయ అడ్డంపడ్డంత పనైంది.. నా మొదటి సినిమా 'మీసమున్న దేవుడు'సినిమా ఫస్ట్ లుక్ పై ప్రముఖ క్రిటిక్ చేసిన కటిక విశ్లేషణ.. చదివినంత సేపూ కన్నీరాగలేదు.. గుండెను ఎవరో బలవంతంగా పిండేస్తున్న బాధ.. గొంతుకనెవరో పిసికేస్తున్నట్టు ఉంది అవును.. ఆయనన్నదాంట్లో తప్పేముంది.. నేనుండే ఇంట్లో పక్క వాటా వాళ్ళుకూడా నేను రోడ్డు మీద కనపడితే.. నేను పలకరించి పరిచయం చేసుకుంటే తప్ప గుర్తించలేరు.. అటువంటి నాలాంటి ఒక అనామకుని తో ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎందుకు తీస్తున్నట్టు.. ఆయన్నే అడిగేద్దాం అని నిర్ణయించుకుని ఫోన్ చేశాను.. తీరా డయల్ చేసి ఫోన్ రింగవుతుంటే గుండెల్లో ఒకటే దడ.. ప్రొడ్యూసర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం ఏంటని అడిగితే ఏమని చెప్పాలి.. ఏ నమ్మకంతో నాతో సినిమా తీస్తున్నారని అడగాలా.. అలా అడిగితే ఆయన ఏమనుకుంటారో.. మరేమని అడగాలి.. ఇలా ఆలోచిస్తుండాగానే.. అనుకున్నట్టుగానే ప్రొడ్యూసర్ గారు ఫోన్ లిఫ్ట్ చేశారు.. ఆ.. హీరోగారూ చెప్పండి..ఏంటి విషయం అని ఎంతో అనునయంగా అన్నారు..నాకు నోట మాటరాలేదు.. కళ్ళ వెంట కన్నీటి ధారలూ ఆగటం లేదు.. నా మౌనం వెనుకదాగున్న భావాన్ని ఆయన గ్రహించినట్టున్నారు.. హీరోగారూ.. ఈ రోజు పేపర్ చదివారా .. ఔనండీ అని తడబడుతూ బెరుగ్గా సమాధానం చెప్పాను.. హీరోగారూ.. నేనో బిజినెస్ మ్యాన్ అన్న సంగతి మీకు తెలుసనుకుంటాను.. తెలుసండీ.. మరి నేను చేసే బిజినెస్ ఏంటో తెలుసా ..తెలియదండీ.. వజ్రాల వ్యపారం.. ఈ వ్యాపారంలో నాకున్న అపార అనుభవంతో ఒక్కసారి చూడగానే ఒక వజ్రం గురించిన వివరాలు కచ్చితంగా చెప్పేయగలను.. అలాగే మనుషుల వ్యక్తిత్వాన్ని అవలీలగా కనిపెట్టగలను.. మీరు ఆ రోజు మా ఆఫీసుకు అటెండర్ పోస్టుకు ఇంటర్వూకు వచ్చినప్పుడే మిమ్మల్ని నిశితంగా పరిశీలించాను.. మీ కళ్ళలో తేజస్సు ముఖంలో వర్ఛస్సు నడకలో హుందాతనం.. అన్నింటికీ మించి మీ ఉన్నత వ్యక్తిత్వం.. విలక్షణ భావజాలం నన్ను ఆకట్టుకున్నాయి.. అప్పుడే నిర్ణయించుకున్నాను.. నేను తీస్తున్న ఈ సంచలన చిత్రానికి మీరే హీరో అని.. అందుకే ఆ రోజు మీకు కావాలనే ఉద్యోగం ఇవ్వలేదు.. ఇక ఆ రివ్యూ అంటారా అది ఆ వ్యక్తి దృష్ఠికోణం.. దానిని పట్టించుకోకండి..ఒకటిమాత్రం గుర్తుంచుకోండి ఈ సినిమాకేకాదు దీనికి సీక్వెల్గా వచ్చే అన్ని సినిమాలకూ మీరే హీరో ...కాబట్టి అనవసర భయాందోళనలు పక్కనపెట్టి షూటింగుకు ప్రిపేరవ్వండి..రేపు సెట్లో కలుద్దాం..అని పెట్టేశారు..మనసంతా ఆనందం..పట్టరాని సంతోషం.. రేపే షూటింగ్..జీవితంలో మొదటిసారి కెమేరాను ఫేస్ చేయబోతున్నాను.. ఇదే ఆలోచనలతో నిద్ర లేచిన నేను తొందరగా తయారయ్యాను.. ఇంతలో నన్ను పికప్ చేసుకునేందుకు కారు వచ్చింది.. ఎక్కి కూర్చున్నాను.. కారు బయలుదేరింది... షూటింగ్ జరిగే ప్రదేశానికి... ........................... ఇంకావుంది