
హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ముగిశాక అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైనే పడింది. పలు సంస్థలు నిర్వహించిన సర్వేలను వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల సమయంలో వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కొన్ని సంస్థలు వెల్లడించిన సర్వేలు ఇంచుమించు నిజమవ్వగా.. మరికొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలు అట్టర్‌ప్లాప్ అయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే 2018 ఎన్నికల తెలంగాణ సీఎం పీఠం ఏ పార్టీ దక్కించబోతోందన్న దానిపై టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. కాగా సర్వే ఫలితాలు అన్నింటికంటే ముందుగా టైమ్స్ నౌ సంస్థ వెల్లడించింది.
టైమ్స్ నౌ- సర్వే ప్రకారం..
తెలంగాణలో మొత్తం స్థానాలు 119
టీఆర్ఎస్- 66
ప్రజాకూటమి- 37
బీజేపీ- 7
ఇతరులు-9
సీట్లు వస్తాయని టైమ్స్ నౌ తేల్చేసింది. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుందా..? అనేది డిసెంబర్ 11న తేలిపోనుంది. ఇదిలా ఉంటే జాతీయ వార్తా చానెళ్లు ఎన్డీటీవీ, ఏబీపీ, హెడ్లైన్ టుడే, సీఎన్ఎన్ ఐబీఎన్, న్యూస్ 24లు వివిధ సర్వే సంస్థలతో కలిసి ఫలితాలను వెల్లడించబోతున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం సాయంత్రం 7గంటలకు ఫలితాలను ప్రకటించబోతున్నారు.